కాంచ‌న 3 రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన లారెన్స్

Sat,March 16, 2019 11:10 AM

కాంచ‌న సిరీస్‌లో వ‌చ్చిన చిత్రాల‌న్ని ఎంత‌టి విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాంచ‌న సిరీస్‌లో నాలుగో భాగంగా కాంచ‌న 3 చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని లారెన్స్ తెర‌కెక్కించి నిర్మించాడు. వేదిక‌, నిక్కీ తంబోలి, ఓవియా క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మొద‌ట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న తెలుగు, త‌మిళంలో విడుద‌ల చేస్తామ‌ని అన్నారు. కాని ఒక రోజు ముందుకి జ‌రిపి ఏప్రిల్ 19న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఈ పోస్ట‌ర్‌లో రుద్రాక్షలు ధరించిన మధ్య వయస్కుడిగా .. స్టైల్ గా .. లారెన్స్ కాలుపై కాలు వేసుకుని కూర్చున్నారు. ఈ పోస్టర్ ఆకట్టుకునేదిగా ఉంది. క‌బీర్ దుహ‌న్ ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించనున్నాడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కూడా త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌ని చిత్ర బృందం భావిస్తుంది. ఇదిలా ఉంటే అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో కాంచ‌న చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నాడ‌ట లారెన్స్. శ‌ర‌త్ కుమార్ పాత్ర కోసం ప‌లువురు ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

1651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles