మ‌రోసారి క‌న్న‌డిగుల ఆగ్ర‌హానికి గురైన మ‌హేష్‌

Fri,October 19, 2018 12:11 PM
kanandains fire on mahesh babu

సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని వెండితెర‌కి ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్నాడు. ఆయ‌న ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ న్యూ యార్క్‌లో జ‌రుగుతుండ‌గా, ఫ్యామిలీతో క‌లిసి అక్క‌డికి వెళ్ళాడు. అయితే ఈ రోజు విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల్లోని త‌న అభిమానుల‌కు మ‌హేష్ విషెస్ చెప్పాడు. ఐదు భాష‌ల‌లో విషెస్ చెప్పిన మ‌హేష్ క‌న్న‌డ అభిమానుల‌ని విష్ చేయ‌డం మ‌ర‌చిపోయాడు. దీంతో వారు మ‌హేష్‌ని ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. దీంతో క‌న్న‌డ‌లోను మ‌హేష్ ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపాడు.

గ‌తంలోను ఇలాంటి అనుభ‌వం మ‌హేష్‌కి ఎదురైంది. భ‌ర‌త్ అనే నేను చిత్రం భారీ విజ‌యం సాధించ‌డంతో .. ఇంత పెద్ద విజ‌యాన్ని అందించిన అభిమానుల‌కి కృత‌జ్ఞ‌త‌లు ఇంటూ తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ట్వీట్ చేశాడు. . దీనిపై కన్నడ ప్రజలు మహేష్‌ బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. క‌న్న‌డ‌లో మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మ‌రి మీకు మేము క‌నిపించ‌డం లేదా, మా భాష‌లో ధ‌న్య‌వాదాలు చెప్ప‌లేక‌పోయారా అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫైర్ అయ్యారు. కన్నడ అభిమానులపై మీరు చూపించిన ఈ పక్షపాతం అస్సలు బాగోలేద‌ని అన్నారు. త్వరలోనే మీకు కన్నడ అభిమానులు గుణపాఠం చెబుతారని కొందరు హెచ్చరించారు. ఈ క్ర‌మంలో మ‌హేష్ త‌న ఫేస్ బుక్ పేజ్ , ట్విట్ట‌ర్ పేజ్ ద్వారా క‌న్న‌డిగుల‌కి కూడా వారి భాష‌లో ధ‌న్య‌వాదాలు తెలిపారు. దీంతో అంద‌రు కూల్ అయ్యారు.5753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles