మరోసారి తెలంగాణ నేపథ్యంలో శేఖర్ కమ్ముల సినిమా!

Fri,December 15, 2017 02:56 PM
Kammula next Telangana Story With Devarakonda

స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆనంద్ , గోదావరి, హ్యపీ డేస్,లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా వంటి అద్బుత చిత్రాలని తెరకెక్కించాడు కమ్ముల. రీసెంట్ గా వరుణ్ తేజ్ , సాయి పల్లవి ప్రధాన పాత్రలలో ఫిదా అనే చిత్రాన్ని తెలంగాణ నేపధ్యంలో అందంగా తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమాకి కేసీఆర్, కేటీఆర్ లతో పాటు పలువురి ప్రముఖుల ప్రశంసలు కూడా లభించాయి. అయితే ఇప్పుడు ఆయన మరోసారి తెలంగాణ నేపధ్యంలో సినిమా తీయాలని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. విజయ్ కి తెలంగాణ భాషపై మంచి పట్టు ఉండడంతో ఈ కుర్రాడే తన కథకి మంచిగా సరిపోతాడని శేఖర్ కమ్ముల భావించినట్టు తెలుస్తుంది. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం శ్రీధర్ మర్రి దర్శకత్వంలో ఏ మంత్రం వేశావే అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల మూవీ చేయనున్నట్టు టాక్.

5621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles