కమల్ వీలునామా ఎవరికి రాశారు?

Fri,May 19, 2017 01:40 PM
kamal writes testament to his daughters

సకల కళావల్లభుడు కమల్ హాసన్ లో ఎంత నటనా పటిమ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ పాత్ర నైన ఇట్టే పండించగల ప్రావీణ్యుడు కమల్. ఇన్నాళ్ళు వెండితెరపై అలరించిన ఉలగనాయగన్ తాజాగా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. మరి కొద్ది రోజులలో రాజకీయ రంగ ప్రవేశం కూడా చేయనున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా కమల్ తన ఆస్తులను వీలునామా రాశాడంటూ ఓ వార్త కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా పలు రంగాలలో తన ప్రతిభ కనబరిచిన కమల్ ఎంత వరకు కూడ బెట్టాడు అంటే చాలా తక్కువే అంటున్నారు ఆయన సన్నిహితులు. ఈ మధ్య రజినీకాంత్ కూడా ఓ సందర్భంలో కమల్ కి డబ్బు వెనకేసుకోవడం రాదు అని మీడియా ముఖంగా చెప్పారు. అయితే ప్రస్తుతం తన దగ్గర ఉన్న ఆస్తిని ఇద్దరు కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లకు చెందేలా వీలునామా రాసినట్టు కోలీవుడ్ టాక్. ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొనే కమల్ ముందుగా ఈ పని చేశారని అక్కడి వారంటున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.

1415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles