కూతురితో క‌లిసి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూసిన క‌మ‌ల్

Thu,August 24, 2017 12:19 PM

ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ గారాల ప‌ట్టీ అక్ష‌ర హాస‌న్ న‌టించిన వివేగం చిత్రం ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెకక్కిన ఈ చిత్రం థ్రిల్లర్ మూవీగా తెరకెకక్కగా, ఇందులో అజిత్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. తొలిసారి కాజల్.. అజిత్ తో జత కట్టగా అక్షర హాసన్ మరియు వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగులో ఈ మూవీ వివేకం టైటిల్ తో విడుదల అయింది. చిత్ర ట్రైల‌ర్ తో పాటు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మూవీపై భారీ అంచ‌నాలు పెంచ‌గా, ప్ర‌స్తుతం ఈ చిత్రం థియేట‌ర్స్ లో హంగామా సృష్టిస్తుంది. అయితే ఈ రోజు ఉద‌యం క‌మ‌ల్ హాస‌న్ త‌న‌ రెండో కూతురు అక్ష‌ర హాస‌న్‌తో క‌లిసి వివేగం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూశాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. ఇంక త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన శివ‌కార్తికేయ‌న్, విఘ్నేష్ శివ‌న్, స‌తీష్ వంటి సెల‌బ్రిటీలు టీంకి విషెస్ తెలియ‌జేశారు. మ‌రి కొద్ది గంట‌ల‌లో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి అప్‌డేట్ రానుంది.


1728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles