ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చిన సినిమా విడుద‌ల చేస్తా : క‌మ‌ల్‌

Tue,June 12, 2018 09:32 AM
kamal says about vishwaroopam 2

కొన్నాళ్ళుగా సినిమాల‌తో ప‌ల‌క‌రించని క‌మ‌ల్ ఎట్ట‌కేల‌కు తాజాగా ట్రైల‌ర్‌తో ప‌ల‌క‌రించాడు. త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ విశ్వ‌రూపం 2 మూవీని ఆగ‌స్ట్ 10న విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. క‌మల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విశ్వరూపం 2. విశ్వ‌రూపం చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది. రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ప్రియా, ఆండ్రియా, నాజ‌ర్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విశ్వ‌రూపం చిత్రంలో అవినీతితో పాటు కొన్ని సంఘ‌ట‌న‌లకి సంబంధించిన సీన్స్ అభిమానుల‌లో ఎంతో ఆస‌క్తిని రేకెత్తించాయి . విశ్వ‌రూపం 2 కూడా అదే రీతిలో ఆడియ‌న్స్‌ని అల‌రిస్తుంద‌ని ట్రైల‌ర్‌ని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది.

తెలుగు ట్రైలర్‌ను ఎన్టీఆర్‌ రిలీజ్‌ చేసి– ‘‘ఒక మనిషి అనేక రూపాలు. కమల్‌గారి ‘విశ్వరూపం’ ట్రైలర్‌ రిలీజ్‌ చేయడం నిజంగా గ‌ర్వంగా ఫీల్‌ అవుతున్నాను’’ అని పేర్కొన్నారు. హిందీలో ఆమీర్‌ ఖాన్‌, తమిళ్‌లో శృతి హాసన్‌లు ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ‘ఏ ఒక్క మతానికో కట్టుబడటం తప్పుకాదు.. దేశ ద్రోహం మాత్రం తప్పు’ అంటూ చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది. ఇక ట్రైల‌ర్‌లో క‌మ‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్‌, పోరాట స‌న్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీది కూడా ప్రేక్ష‌కుల‌ని క‌ట్టిప‌డేసేలా ఉంది. ఇక‌ ఈ సినిమాపై ఇండియాలోనే కాదు విదేశాల‌లోను భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే మొదటి భాగానికి ఎదురైనట్టే ఈ సినిమాకు సమస్యలు ఎదురైన‌ రాజకీయంగా ఎదుర్కో వడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ క‌మ‌ల్ సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం గ‌మ‌న‌ర్హం.

2995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles