'విశ్వ‌రూపం 2' వాయిదా వేసే ఆలోచ‌న‌లో క‌మ‌ల్‌ ..!

Wed,August 8, 2018 01:40 PM

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ తెర‌కెక్కించి న‌టించిన చిత్రం విశ్వ‌రూపం 2. ఈ సినిమా విడుద‌ల‌కి అనేక అడ్డంకులు ఎదురైన‌ప్ప‌టికి, వాటన్నింటిని అధిగ‌మించి ఆగ‌స్ట్ 10న విడుద‌ల చేసేందుకు సిద్ధం చేశాడు . సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా త‌మిళం , తెలుగులో ప‌లు ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన క‌మ‌ల్ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాడు. అయితే డీఎంకే అధినేత‌ క‌రుణానిధి మ‌ర‌ణించ‌డంతో విశ్వరూపం 2 చిత్రాన్ని ఆగ‌స్ట్ 15కి వాయిదా వేయాల‌ని భావిస్తున్నాడ‌ట క‌మ‌ల్‌. ఈ రోజు ఉద‌యం క‌రుణానిధి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన త‌ర్వాత ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో సినిమా విడుద‌ల చేయ‌డం మంచిది కాద‌ని భావించి, క‌మ‌ల్‌ ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నట్టు కోలీవుడ్ టాక్. విశ్వ‌రూపం 2 చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజ‌ర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. తెలుగు, తమిళంతోపాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. కమల్‌ స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌తోపాటు, ఆస్కార్‌ ఫిలింస్‌ విశ్వరూపం-2 ను సంయుక్తంగా నిర్మించాయి. ఇండియాలోనే కాక విదేశాల‌లోను ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొంది. 12 సంవ‌త్స‌రాల‌లోపు వయస్సు ఉన్న వ్య‌క్తులు త‌మ త‌ల్లి దండ్రులతో క‌లిసి సినిమా చూడాల‌ని సెన్సార్ బోర్డ్ ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

2316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles