మ‌హేష్‌కి ధ‌న్యవాదాలు తెలిపిన లోక‌నాయ‌కుడు

Tue,November 12, 2019 09:53 AM

లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌వంబ‌ర్ 7తో 65వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. క‌మ‌ల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు, సినీ సెల‌బ్రిటీలు ఆయ‌న‌కి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా త‌న ట్విట్ట‌ర్‌లో క‌మ‌ల్‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. సినిమాకు మీ సహకారం అసాధారణమైనది ... సినిమాల్లో 60 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసినందుకు అభినందనలు. ఇది నిజంగా ఉత్తేజప‌రిచే విష‌యం. మీరు ఆనందం మరియు ఆరోగ్యంతో ఉండాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను అని మ‌హేష్ పేర్కొన్నారు. అయితే మ‌హేష్ ట్వీట్‌కి తాజాగా క‌మ‌ల్ స్పందించారు. ధ‌న్యవాదాలు మ‌హేష్ జీ. మీరు కూడా బాల క‌ళాకాకురుడిగా వృత్తిని ప్రారంభించారు. మీ విశిష్టమైన వృత్తిలో భారీ పురోగతి సాధించారు. మీ విషెస్‌ని నేను వినయంగా అంగీకరిస్తున్నాను. మీకు ఎల్లప్పుడూ నా శుభాకాంక్షలు అని క‌మ‌ల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. గ‌త రెండు మూడు రోజులుగా ప‌లు కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న క‌మ‌ల్‌, త‌న‌కి శుభాకాంక్ష‌లు తెలిపిన వారంద‌రికి నేడు రిప్లై ఇస్తున్నాడు.






1227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles