నోట్ల రద్దును సమర్థించడం తప్పే.. క్షమించండి!

Wed,October 18, 2017 02:06 PM
నోట్ల రద్దును సమర్థించడం తప్పే.. క్షమించండి!

చెన్నై: కమల్‌హాసన్‌కు అప్పుడే రాజకీయ నేత లక్షణాలు వచ్చేశాయి. గతంలో నోట్ల రద్దను సమర్థింస్తూ.. మోదీకి సెల్యూట్ అంటూ ట్వీట్ చేసిన కమల్ ఇప్పుడు తప్పయింది.. క్షమించండి అని అంటున్నాడు. మోదీ కూడా తన తప్పును తెలుసుకుంటే.. ఆయనకు కూడా సెల్యూట్ చేస్తానని అన్నాడు. ఓ తమిళ మ్యాగజైన్‌కు రాసిన ఆర్టికల్‌లో కమల్ ఈ కామెంట్స్ చేశాడు. అంతేకాదు చేసిన తప్పును అంగీకరించడం, దానిని సరిదిద్దుకోవడం ఓ రాజ నీతిజ్ఞుడి లక్షణమని అతను అన్నాడు. అప్పట్లో పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే.. సెల్యూట్ మిస్టర్ మోదీ.. అన్ని రాజకీయ పార్టీలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అంటూ కమల్ ట్వీట్ చేశాడు. అయితే రెండు నెలల కిందటే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్.. కచ్చితంగా బీజేపీలో మాత్రం చేరను అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు నోట్ల రద్దును సమర్థించడం తప్పే అని అంగీకరించడం గమనార్హం. అయితే ఇప్పుడు నోట్ల రద్దును తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడన్న విషయాన్ని మాత్రం కమల్ చెప్పలేదు.

2392

More News

VIRAL NEWS