నాని బిగ్ బాస్ హౌజ్ లోకి క‌మ‌ల్ ఎంట్రీ

Thu,August 2, 2018 12:43 PM
kamal entry into bigg boss2 house

హిందీలో బిగ్ బాస్ కార్య‌క్ర‌మంకి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లోను బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 1కి ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉండగా, సీజ‌న్ 2కి నాని హోస్ట్‌గా ఉంటున్నారు. ఇక త‌మిళంలో రెండు సీజ‌న్స్‌కి క‌మ‌ల్ హాస‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌ల‌యాళం బిగ్ బాస్‌ని మోహ‌న్ లాల్ హోస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ పాల్గొన‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. క‌మ‌ల్ న‌టించిన విశ్వ‌రూపం 2 చిత్రం ఆగ‌స్ట్ 10న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా క‌మ‌ల్ .. నానితో పాటు హౌజ్ మేట్స్‌తో క‌లిసి సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. విశ్వ‌రూపం2 కి సంబంధించిన అనేక విష‌యాల‌ని హౌజ్ మేట్స్‌తో పాటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌తో పంచుకోనున్నాడ‌ని అంటున్నారు. శ‌నివారం లేదా ఆదివారాల‌లో ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంద‌ని ఇన్‌సైడ్ టాక్. మరి యూనివ‌ర్స‌ల్ స్టార్‌తో మ‌న‌ నేచుర‌ల్ స్టార్ సంద‌డి ఎలా ఉంటుందో తెలియాలంటే మ‌రో రెండు రోజులు వేచి చూడ‌క తప్ప‌దు.


2665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS