‘బాబాయ్, వాళ్ల నాన్నగారిలా..నేను, మా నాన్నగారిలా..’

Thu,October 11, 2018 07:01 PM
kalyanram as harikrishna first look revealed

నంద‌మూరి బాల‌కృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్‌. రెండు భాగాలుగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల కానుంది. మొదటి విభాగానికి ‘కథానాయకుడు’ అని, రెండో విభాగానికి ‘మహానాయకుడు’ అనే టైటిల్స్‌ను ఖరారు చేశారు. తాజా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త లుక్ ఒకటి విడుదలైంది. బయోపిక్ లో నందమూరి కల్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. హరికృష్ణ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను కల్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.

‘30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో బాలగోపాలుడు సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పడు..బాబాయి, వాళ్ల నాన్నగారిలా.., నేను మా నాన్న గారిలా’ అని క్యాప్షన్ పెట్టాడు కల్యాణ్ రామ్. తాజాగా బయటకు వచ్చిన పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తుంది. ఎన్టీఆర్ రాజకీయ యాత్రలో హరికృష్ణ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టిస్తుంది. ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రని రానా పోషిస్తుండ‌గా, ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి , ఎన్టీఆర్ కూతురు పురందేశ్వ‌రిగా హిమాన్సీ నటిస్తున్నారు. ఎస్వీఆర్ పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నాడు అని స‌మాచారం. కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌లో నందమూరి బాలకృష్ణ న‌టిస్తుండ‌గా, దివ‌గంత న‌టి శ్రీదేవి పాత్ర‌లో ర‌కుల్ క‌నిపించ‌నుంది.
6400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles