‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ మ్యూజిక్ డైరెక్టర్ తో వర్మ

Mon,October 22, 2018 10:00 PM
kalyanmalik to compose for laxmis NTR

నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వర్మ టీం ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రకటన చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి కల్యాణ్ మాలిక్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘ఎన్టీఆర్’ కు పనిచేస్తున్న ఎంఎం కీరవాణి సోదరుడైన కల్యాణ్ మాలిక్ మా సినిమాకు పనిచేయడం యాదృచ్చికంగా జరిగింది. ఆయనను ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేయలేదని ట్వీట్ చేశాడు వర్మ. కల్యాణ్ మాలిక్ తో దిగిన ఫొటోను వర్మ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. రాకేశ్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జీవీ ఫిల్మ్స్‌ సంస్థ సమర్పిస్తోంది. దీపావళికి ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు వర్మ తెలిపారు.
2277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles