పింక్ త‌మిళ రీమేక్‌లో హ‌లో భామ‌ ..!

Tue,December 18, 2018 12:33 PM
Kalyani Priyadarshan On Board For Pink Remake

త‌ల అజిత్ ప్ర‌ధాన పాత్ర‌లో పింక్ రీమేక్ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోగా , ఫిబ్ర‌వ‌రిలో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళి, జూన్‌లో రిలీజ్ చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. బోనిక‌పూర్ నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రానికి హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. త‌మిళ వ‌ర్షెన్‌లో తాప్సీ పాత్ర‌ని న‌జ్రియా చేయ‌నుండ‌గా, అమితాబ్ బ‌చ్చ‌న్ పాత్ర‌ని అజిత్ చేయ‌నున్నాడని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం తాప్సీ పాత్ర‌ని హ‌లో చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ చేయ‌నుంద‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ ఇవ్వ‌నున్నారు. ఇక అధిక్ ర‌విచంద్ర‌న్‌, రంగ‌రాజ్ పాండే కూడా ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు చేయ‌నున్నారు. హిందీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, గ్లామ‌ర్ బ్యూటీ తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన‌ పింక్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాక ప‌లు అవార్డుల‌ని పొందింది. వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం పింక్‌.

818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles