కళ్యాణ వైభోగమే రిలీజ్ ట్రైలర్ విడుదల

Mon,February 29, 2016 06:13 PM
Kalyana Vaibhogame Release Trailer

నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కళ్యాణ వైభోగమే చిత్రం మార్చి 4న విడుదల కానుండగా ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసారు. నాగశౌర్య, మాళవిక ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశి, మాళవిక మదర్‌గా నటించింది. అయితే ఎన్నో అంచనాలతో ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండగా, ఈ చిత్రంతో పలు సినిమాలు పోటి పడేందుకు సిద్దమయ్యాయి.

కళ్యాణ వైభోగమే చిత్ర టైటిల్ చాలా క్యాచీగా ఉండగా ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. కళ్యాణ్ కోడూరి అందించిన సంగీతం చిత్రానికి ప్లస్ అవుతుందని యూనిట్ భావిస్తుంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్ నెటిజన్లను ఆకర్షిస్తుండగా, ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందనే ఆలోచనలో అభిమానులు ఉన్నట్టు తెలుస్తుంది. మరి లేటెస్ట్‌గా విడుదలైన ఆ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.


2322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles