గ్రాండ్ గా లాంచ్ అయిన‌ నందమూరి హీరో మ‌రో మూవీ

Sun,July 30, 2017 11:24 AM
kalyan ram new movie launched today

ఒక వైపు నిర్మాతగా, మరో వైపు హీరోగా వరుస సినిమాలతో జోరు మీదున్నాడు నందమూరి కళ్యాణ్‌ రామ్. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జై లవకుశ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్‌ రామ్ హీరోగా ఉపేంద్ర మాదవ్ దర్శకత్వంలో ఎంఎల్ఏ అనే చిత్రం చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ కథానాయాకగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మనందం ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీని లైన్లో పెట్టాడు ఈ పటాస్ హీరో. 180 ఫేం జయేంద్ర దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తుంది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్న ఈ చిత్రం పలువురి సెలబ్రిటీల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ అయింది. హైద‌రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాలు జరుపుకోగా, తొలి షాట్ కి ఎన్టీఆర్ క్లాప్ కొట్టారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో మలయాళీ భామ 'ఐశ్వర్య లక్ష్మి' ఇందులో కథానాయికగా నటించనున్నట్టు సమాచారం

1392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles