యాక్ష‌న్ మూడ్‌లోకి క‌ళ్యాణ్ రామ్‌..!

Sun,September 23, 2018 09:16 AM
kalyan ram in action mode

నంద‌మూరి హ‌రికృష్ణ మృతితో కొన్నాళ్ళు షూటింగ్‌కి దూరంగా ఉన్న క‌ళ్యాణ్ రామ్ రీసెంట్‌గా త‌న టీంతో క‌లిసారు. న‌టుడిగా, నిర్మాత‌గా దూసుకెళుతున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ రీసెంట్‌గా నా నువ్వే అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 59 ఏళ్ల రైటర్ జయేంద్ర దర్శకత్వంలో నా నువ్వే రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందింది. తమన్నా కథానాయికగా నటించిన‌ ఈ చిత్రానికి లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ పనిచేయడం విశేషం. అయితే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని మెప్పించ‌లేక‌పోయింది. దీంతో త‌న త‌దుప‌రి సినిమాపై ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాడు క‌ళ్యాణ్ రామ్‌. త‌న 16వ ప్రాజెక్ట్‌ని కూడా కెవి గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనే చేస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్‌. గుహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. కల్యాణ్ రామ్ .. కొందరు ఫైటర్స్ కాంబినేషన్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలిని పాండే నటిస్తున్నారు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు2400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles