మెగా అల్లుడి మూవీ సెట్స్ పైకి వెళ్లింది

Thu,February 8, 2018 10:44 AM
kalyan movie goes on to the sets

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భ‌ర్త క‌ళ్యాణ్ దేవ్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న‌ చిత్రం జ‌న‌వ‌రి 31న పూజా కార్యక్ర‌మాలు జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రారంబోత్స‌వ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి త‌దిత‌రులు పాల్గొన్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా.. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. తాజాగా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్ర షూటింగ్ జ‌రుగుతుండ‌గా, హీరో హీరోయిన్స్‌పై ప్ర‌త్యేక స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నార‌ట‌. కాలేజ్ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశంగా ఈ సినిమాని రాకేశ్ శ‌శి తెర‌కెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వారాహి’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్‌కు జోడీగా "ఎవడే సుబ్రమణ్యం" ఫేమ్ మాళవిక నాయర్ నటిస్తుంది. "బాహుబలి" చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తింస్తుండ‌గా.. "రంగస్థలం" చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌లో నటిస్తున్నారు.

1251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles