క‌ళ్యాణ్ దేవ్ రెండో సినిమాకి టైటిల్ ఫిక్స్‌..!

Thu,June 21, 2018 12:04 PM
kalyan dev second movie title fixed

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ‌ని వివాహం చేసుకొని మెగా అల్లుడిగా మారాడు క‌ళ్యాణ్ దేవ్. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విజేత చిత్రంతో వెండితెర ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు . ఇటీవ‌ల చిత్ర‌ ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల కాగా ఇందులో క‌ళ్యాణ్ దేవ్ లుక్స్‌తో పాటు ఎక్స్‌ప్రెష‌న్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. మాళవిక నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు. ఈ సినిమాకి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

క‌ళ్యాణ్ దేవ్ తొలి చిత్రం విడుద‌ల కాకుండానే రెండో సినిమాకి సంబంధించిన స‌న్నాహాలు చేస్తున్నార‌ని ఫిలింన‌గ‌ర్ టాక్. ప్ర‌స్తుతం మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ చిత్రానికి వ‌ర‌ప్ర‌సాద్ గారి అల్లుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చిరంజీవి అస‌లు పేరు కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ కాగా, ఇందులో వ‌ర‌ప్ర‌సాద్‌ని తీసుకొని క‌ళ్యాణ్ దేవ్ రెండో సినిమా టైటిల్ వ‌ర‌ప్ర‌సాద్ గారి అల్లుడు అని పెట్టార‌ట‌. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్ర న‌టీన‌టులు, ద‌ర్శ‌క నిర్మాత‌ల వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

1404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles