బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కీల‌క‌ నిర్ణ‌యం తీసుకున్న మెగా అల్లుడు

Tue,February 12, 2019 08:18 AM

మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత అనే సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికి క‌ళ్యాణ్ దేవ్ లుక్స్‌, ఆయ‌న‌ న‌ట‌నకి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇప్పుడు రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో క‌ళ్యాణ్ త‌న రెండో సినిమా చేయ‌నుండ‌గా, ఈ సినిమాని పులి వాసు తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ చిత్రంతో వాసు ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. చిత్రంలో క‌ళ్యాణ్ కి జోడీగా తూనీగ తూనీగ ఫేం రియా చ‌క్ర‌వ‌ర్తిని ఎంపిక చేశార‌ట. క‌ట్ చేస్తే క‌ళ్యాణ్ దేవ్ నిన్న త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మ‌ర‌ణానంత‌రం త‌న అవ‌య‌వాల‌ని దానం చేసేందుకు అంగీక‌రిస్తున్న‌ట్టు అంగీక‌ర ప‌త్రాన్ని అపోలో ఆసుపత్రికి అందజేశారు. ఈ విషయాన్ని కల్యాణ్ దేవ్ ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నారు. మ‌నం ప్ర‌పంచాన్ని వ‌దిలి వెళ్ళేట‌ప్పుడు దేనిని మ‌న వెంట తీసుకెళ్ళ‌లేం అని కామెంట్‌లో తెలిపాడు. క‌ళ్యాణ్ దేవ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న రెండో సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. ఇందులో స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

2232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles