మెగా అల్లుడి సినిమా టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Wed,May 23, 2018 10:04 AM

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ త్వ‌ర‌లోనే వెండితెర ఆరంగేట్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో త‌న డెబ్యూ మూవీ చేస్తున్నాడు క‌ళ్యాణ్‌. ఈ చిత్రానికి సంబంధించి సింగిల్ షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉందని తెలుస్తుండ‌గా, ఇప్ప‌టికే డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఇటీవ‌ల‌ కళ్యాణ్ దేవ్ డబ్బింగ్ చెబుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హాల్ చ‌ల్ చేసింది. ఎవడే సుబ్రహ్మణ్యం’- ‘కళ్యాణ వైభోగమే’ ఫేం మాళవికా నాయర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కాలేజ్ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశంగా ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వారాహి’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

"బాహుబలి" చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. "రంగస్థలం" చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం చిత్ర టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌ చేశారు. 1985లో చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో కోదండ‌రామి రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం విజేత‌. ఇదే టైటిల్‌ని మెగా అల్లుడి మూవీకి ఫిక్స్ చేశారు. విజేత అనే టైటిల్‌తో రూపొందిన పోస్ట‌ర్‌ని ప్రీ లుక్‌గా విడుద‌ల చేయ‌గా ఇందులో రెండు చేతులు క‌లిసి ఉన్న ఫోటోతో పాటు కొటేష‌న్ ఉంది. ఇత‌రుల మొహంపై న‌వ్వు తెప్పించ‌డం కూడా స‌క్సెస్ అని రాసి ఉంది. ఈ పోస్ట‌ర్ మెగా ఫ్యాన్స్ ని అల‌రిస్తుంది. తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నాడు . త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు.

4211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles