అభిమానుల‌లో ఆశ‌లు రేపుతున్న క‌ల్కి ట్రైల‌ర్

Tue,June 25, 2019 12:15 PM
kalki trailer released

సీనియ‌ర్ న‌టుడు రాజ‌శేఖ‌ర్ చివ‌రిగా గ‌రుడ‌వేగ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెల‌సిందే. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్కి అనే చిత్రం చేస్తున్నాడు. జూన్ 28న ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, మేక‌ర్స్ మూవీపై ఆస‌క్తి క‌లిగేలా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి లిరిక‌ల్ సాంగ్స్ విడుద‌ల చేసిన టీం తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ‘ఆకాశవాణి.. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు దారుణ హత్య తర్వాత నర్సప్ప పెరుమాండ్ల వర్గీయుల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి’ అన్న డైలాగ్‌తో ట్రైలర్ మొద‌లైంది. చివ‌ర‌లో ‘చంపిందెవరో చెప్పాల్సింది నేను’ అని రాజశేఖర్‌ కోపంగా చెబుతున్న డైలాగ్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. చిత్రంలో ముగ్గురు క‌థానాయికలు నటిస్తుండగా, అందులో ఒక‌రు హార్ట్ ఎటాక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదా శ‌ర్మ కాగా, మ‌రొక‌రు బాహుబ‌లి-ది బిగినింగ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్, ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడ ఫేం నందిత శ్వేత. ఈ చిత్రం 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కింది. చిత్రాన్ని శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపొందిస్తుండ‌గా.. సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles