రాజశేఖర్ కల్కి టీజ‌ర్‌ విడుదల

Wed,April 10, 2019 10:26 AM
Kalki Movie Teaser released

గరుడవేగ చిత్రం తో ప్రేక్షకులని థ్రిల్ చేసిన రాజశేఖర్ ప్రస్తుతం కల్కి అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతుంది. చిత్రాన్ని శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపొందిస్తుండ‌గా.. సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినిమా పూర్తి బాధ్య‌త‌ను ప్ర‌శాంత్ వ‌ర్మ మోస్తున్నాడు. 'అ!' త‌ర్వాత త‌నకొక మంచి హిట్ వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను అని నిర్మాత అన్నారు. ఇటీవల ఓ టీజ‌ర్‌ విడుదల చేసి మూవీ ఫై భారీ అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ తాజాగా మరో టీజ‌ర్‌ విడుదల చేసింది. ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులకి సినిమాఫై ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి మీరు ఈ టీజ‌ర్‌ చూసి ఎంజాయ్ చేయండి. చిత్రంలో ముగ్గురు క‌థానాయికలు నటిస్తుండగా, అందులో ఒక‌రు హార్ట్ ఎటాక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదా శ‌ర్మ కాగా, మ‌రొక‌రు బాహుబ‌లి-ది బిగినింగ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్, ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడ ఫేం నందిత శ్వేత.

1274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles