జ‌య‌ల‌లితగా కాజోల్‌.. శ‌శిక‌ళ‌గా అమ‌లాపాల్‌..!

Tue,April 16, 2019 09:44 AM

న‌టిగా,రాజ‌కీయ నాయ‌కురాలిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు జ‌య‌లలిత‌. 1960 మ‌ధ్య కాలంలో టాప్ హీరోయిన్‌గా అలరించిన జ‌య‌లలిత తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌,భాష‌ల‌లో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది . భార‌త రాజ‌కీయాల‌లోను ముఖ్య భూమిక పోషించిన జ‌య‌ల‌లిత దాదాపు 14 సంవత్స‌రాల‌కి పైగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తించింది. త‌మిళ తంబీలు అమ్మ‌గా పిలుచుకొనే జ‌య‌ల‌లిత కొద్ది రోజుల క్రితం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆమెపై బ‌యోపిక్ రూపొందించేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు స‌న్నాహాలు చేస్తున్నారు.


పురుచ్చతలైవీ జీవిత నేప‌థ్యంలో తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జ‌య‌ల‌లిత‌ బ‌యోపిక్ రూపొందిస్తుంది. ఇందులో నిత్యామీన‌న్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఇక త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్‌ విజ‌య్ తాను త‌లైవీ అనే టైటిల్‌తో జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని తెర‌కెక్కిస్తున్నాడు. వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. ఇందులో కంగ‌నా రనౌత్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది .ఇక తాజాగా కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి శ‌శి ల‌లిత పేరుతో జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. జయలలిత ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు ఎం జరిగింది అనేది ఇందులో చూపించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో జ‌య‌ల‌లిత‌గా కాజోల్ న‌టించ‌నుండ‌గా, శ‌శిక‌ళ‌గా అమ‌లాపాల్‌ని ఎంపిక చేసార‌ని చెబుతున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

1960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles