తేజ సినిమాతో నిర్మాతగా కాజల్..?

Mon,June 17, 2019 04:36 PM
kajal to turn as producer with teja movie ?


దర్శకుడు తేజ, కాజల్ కాంబినేషన్‌లో ఇప్పటికే లక్ష్మీకల్యాణం, నేనే రాజు నేనే మంత్రి, సీత చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ‘సీత’ మూవీ బాక్సాపీస్ వద్ద ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాజల్ కోసం తేజ మరోసారి లేడీ ఓరియెంటెడ్ బ్యాక్‌డ్రాప్‌లో కథను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో కాజల్ నిర్మాత కూడా మారనుందట. ప్రస్తుత సమాజానికి, నేటి యువతరానికి కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు తేజ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

1902
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles