ఈ సారి యంగ్ హీరోతో జ‌త‌క‌డుతున్న కాజ‌ల్‌ ..!

Wed,March 21, 2018 11:08 AM
kajal, ram pothineni project very intresting

క‌లువ క‌ళ్ల సుందరి కాజ‌ల్ స్పీడ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. చంద‌మామ సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు ఇటు సీనియ‌ర్ హీరోల‌తో పాటు కుర్ర హీరోల‌తోను జ‌త‌క‌డుతుంది. రీసెంట్‌గా అ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కాజ‌ల్ ఇటీవ‌లే ఎంఎల్ఏ( మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అబ్బాయి) అనే చిత్ర షూటింగ్ పూర్తి చేసింది. మార్చి 23న ఈ మూవీ విడుద‌ల కానుంది. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది కాజ‌ల్‌. ఇక యంగ్ హీరో రామ్ స‌ర‌స‌న న‌టించేందుకు కాజ‌ల్ సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. రామ్ ప్ర‌స్తుతం త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ త‌ర్వాత పీఎస్వీ గ‌రుడవేగ ఫేం ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఇందులో క‌థానాయిక‌గా కాజ‌ల్‌ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. గ‌తంలో రామ్‌, కాజ‌ల్ క‌లిసి గ‌ణేష్( 2009) అనే చిత్రంలో క‌లిసి న‌టించారు. భ‌వ్య క్రియేష‌న్స్ బేన‌ర్‌పై వెనిగ‌ళ్ళ ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు.

2917
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles