హ‌ర్ర‌ర్ మూవీలో కాజ‌ల్ అగర్వాల్

Fri,July 7, 2017 05:36 PM

గ్లామ‌ర్ క్వీన్ కాజ‌ల్ వ‌రుస సినిమాల‌తో జోరు పెంచింది. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన కాజ‌ల్ త‌మిళంలో అజిత్ హీరోగా తెర‌కెక్కిన వివేగం చిత్రంలో న‌టించింది . ఇక ఇప్పుడు విజ‌య్ 61వ చిత్రం మెర్సల్ తో పాటు క‌ళ్యాణ్ రామ్ ఎం.ఎల్.ఏ చిత్రంలోను క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తాజాగా మ‌రో ఆఫ‌ర్ ఈ అమ్మ‌డికి ద‌క్కిన‌ట్టు స‌మాచారం. 2015లో చిన్న చిత్రంగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన రాజుగారి గ‌దికి సీక్వెల్ గా రాజు గారి గ‌ది2 తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగ్ మోడ్రన్ మాంత్రికుడిగా కనిపించనున్నాడు. సీరత్ కపూర్, సమంతలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజ‌ల్ కూడా ప్ర‌త్యేక పాత్ర పోషించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. నాగ్ ఇంట్రెస్ట్ వ‌ల‌నే కాజ‌ల్ ఇందులో న‌టిస్తుంద‌ని, ఈ మూవీ కోసం త‌న ప‌ది రోజుల కాల్షీట్ కేటాయించిద‌ని టాక్. త్వ‌ర‌లోనే కాజ‌ల్ టీంతో క‌ల‌వ‌నుంద‌ని స‌మాచారం. వెన్నెల కిషోర్, ప్ర‌వీణ్‌, అశ్విన్ స‌పోర్టింగ్ రోల్స్ చేస్తుండ‌గా ఈ చిత్రం మేజ‌ర్ పార్ట్ హైద‌రాబాద్, పాండిచ్చేరిల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. పివిపి బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

2309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles