సినిమా నిర్మించేందుకు హీరోయిన్ ప్లాన్..?

Wed,February 13, 2019 08:21 PM

తమ అభిరుచులకు అనుగుణమైన మంచి కథ దొరికితే నిర్మాతల కోసం ఎదురుచూడకుండా తామే నిర్మాణబాధ్యతల్ని చేపట్టడానికి సిద్ధపడుతున్నారు నేటితరం హీరోహీరోయిన్లు. ఇప్పటికే చాలా మంది నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ చేరనున్నట్లు తెలిసింది. కేఏ వెంచర్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించనున్న కాజల్.. తెలుగులో ఓ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.

‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు టాక్. మహిళా ప్రధాన కథాంశంతో దర్శకుడు సిద్ధం చేసిన పాయింట్‌లోని కొత్తదనం నచ్చడంతో కాజల్‌ అగర్వాల్‌ ఈ ప్రాజెక్టులో కథానాయికగా నటిస్తూ నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో తన నిర్మాణ సంస్థ ద్వారా మరిన్ని కథాబలమున్న మంచి చిత్రాల్ని నిర్మించాలనే ఆలోచనలో కాజల్‌ అగర్వాల్‌ ఉన్నట్లు తెలిసింది. కాజల్ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఇండియన్‌-2’ కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

4132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles