వాలుజ‌డ ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసిన కాజ‌ల్

Sun,August 27, 2017 05:35 PM

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన క‌బాలి చిత్రంలో తలైవా కూతురిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి ధన్సిక‌. ప్ర‌స్తుతం వాలుజ‌డ అనే చిత్రంతో పాటు సోలో అనే చిత్రం చేస్తుంది. వాలుజ‌డ చిత్రం ర‌మ‌ణ మ‌ల్లం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా ఇందులో నివిన్ పౌలీ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని కాజ‌ల్ చేతుల మీదుగా విడుద‌ల చేయించారు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సింహ వాహిని చలన చిత్రం, సాయి వైభవి స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వాలుజ‌డ ఫ‌స్ట్ లుక్ కి విశేష స్పంద‌న వ‌స్తుండ‌గా త్వ‌ర‌లోనే టీజ‌ర్ రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.




3402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles