మేనేజర్ రోని వ్య‌వ‌హారంపై నోరు విప్పిన కాజ‌ల్

Tue,July 25, 2017 01:49 PM

గంజాయి కేసులో కాజ‌ల్ అగ‌ర్వాల్ మేనేజ‌ర్ రోనీ ని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత కాలంగా హీరోయిన్ కాజ‌ల్ కు మేనేజ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు రోని. చాలా కాలం నుంచి రోని డ్ర‌గ్స్ వాడుతున్న‌ట్లు తెలుసుకున్న అధికారులు అత‌డిని అరెస్ట్ చేసి రిమాండ్ కి త‌ర‌లించారు. ఈ డ్ర‌గ్స్ కేసులో హీరోయిన్ కాజ‌ల్ కి కూడా ఏమైన సంబంధాలు ఉన్నాయా అని ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ అమ్మ‌డు త‌న ట్విట్ట‌ర్ లో ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. రోని అరెస్ట్ విష‌యంతో పాటు డ్ర‌గ్స్ అంశం న‌న్ను చాలా షాక్ కి గురి చేసింది. స‌మాజానికి హాని క‌లిగించే ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కి నేను జీరో స‌పోర్ట్ ఇస్తాను. నా కోసం ప‌ని చేసే వారి ప‌ట్ల నేను చాలా నిజాయితీగా, అభిమానంగా ఉంటాను. వారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఎంటరై వారిని నేను నియంత్రించ‌లేను . నా కెరీర్ కి సంబంధించి ఎక్కువ విష‌యాలు మా అమ్మా, నాన్న‌లే చూసుకుంటారు. న‌ట‌న ప‌రంగా ప్ర‌తి ఒక్క‌రితో చాలా స్నేహ పూర్వ‌కంగా ఉంటాను, కాని వారి అల‌వాట్ల విష‌యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌ను. ఇండ‌స్ట్రీలో ప‌లు ర‌కాల వ్య‌క్తులతో పని చేయాల్సి ఉంటుంది. సినిమా పూర్తైంది అంటే త‌ర్వాత మ‌ళ్ళీ వారిని క‌ల‌వ‌ను అంటూ కాజ‌ల్ , రోని వ్య‌వ‌హారంపై స్పందించింది కాజ‌ల్. రోని హీరోయిన్స్ రాశీ ఖ‌న్నా, లావ‌ణ్య త్రిపాఠికి కూడా మేనేజ‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే.4231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles