కాజ‌ల్‌కి ఏ క్రికెటర్‌పై క్ర‌ష్ ఉండేదో తెలుసా ?

Tue,April 30, 2019 01:29 PM
Kajal Aggarwal Has a Crush on Indian Cricketer Rohit Sharma

క‌లువ కళ్ళ సుంద‌రి కాజ‌ల్ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఇటు తెలుగు అటు త‌మిళ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఒక‌వైపు సీనియ‌ర్ హీరోస్‌తో న‌టిస్తూనే మ‌రో వైపు కుర్ర హీరోల‌తో జ‌త క‌డుతుంది . ప్ర‌స్తుతం తాను తెలుగులో సీత అనే సినిమా చేస్తుంది. ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది . నాయిక ప్ర‌ధాన నేప‌థ్యంలో సాగే చిత్రం సీత కాగా, ఇందులో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ న‌టిస్తున్నాడు. తేజ మూవీని డైరెక్ట్ చేశాడు. అనీల్ సుంక‌ర నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మ‌రోవైపు ఇండియ‌న్ 2 లో క‌మ‌ల్ స‌ర‌స‌న కూడా కాజ‌ల్ న‌టిస్తుంది. ఇవే కాక ‘పారిస్‌ పారిస్‌’, ‘కోమలి’ అనే త‌మిళ చిత్రాల‌తో పాటు శ‌ర్వానంద్‌తో కూడా ఓ చిత్రం చేస్తుంద‌ట‌. అయితే ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో భార‌త టీం ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ అంటే త‌న‌కి చాలా ఇష్ట‌మ‌ని, ఒకప్పుడు అతనిపై క్ర‌ష్ ఉండేద‌ని కాజ‌ల్ తెలిపింది. క్రికెట్‌లో అత‌ని స్కిల్స్ త‌న‌ని చాలా ఆక‌ట్టుకున్నాయ‌ని కాజ‌ల్ పేర్కొంది. ఈ రోజు త‌న 32వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న రోహిత్ గురించి కాజ‌ల్ ఇలాంటి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. హిట్ మ్యాన్ రోహిత్‌ వ‌న్డేలో స‌రికొత్త రికార్డులు సృష్టించి క్రికెట్ ల‌వర్స్ గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేస‌కున్న విష‌యం విదిత‌మే.

4317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles