నంద‌మూరి హీరో సినిమా టీంతో క‌లిసిన కాజ‌ల్

Sun,July 2, 2017 12:35 PM
Kajal Aggarwal enters into MLA

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఇటు నటుడిగానే కాదు నిర్మాత‌గాను స‌క్సెస్ రూట్ లో వెళుతున్నాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ హీరోగా జై ల‌వ‌కుశ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న‌ క‌ళ్యాణ్ రామ్ , ఎంఎల్ ఏ (మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అబ్బాయి) అనే చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, రెండో షెడ్యూల్ ఈ రోజు నుండి హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది. చిత్ర హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా టీంతో క‌లిసింది. ఈ విష‌యాన్ని ఫోటోస్ షేర్ చేస్తూ తెలిపింది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌రికొత్త లుక్ లో క‌నిపించ‌నున్నాడు. ఈ ఏడాది చివ‌రిలో విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని భరత్ చౌదరి మరియు కిరణ్ కుమార్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


1884
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles