ఈ మధ్య కాలంలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలకి ఆదరణ మరింత పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో అనుష్క, నయనతార, త్రిష వంటి భామలు ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు వారి బాటలోనే కలువ కళ్ళ సుందరి కాజల్ నడవాలనుకుంటుంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రంతో పాటు తమిళ క్వీన్ రీమేక్ లో నటిస్తున్న కాజల్ త్వరలో అర్ధనారి ఫేం భాను శంకర్ చౌదరి దర్శకత్వంలో లేడి ఓరియెంటెడ్ చిత్రం చేయనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల దర్శకుడు కాజల్ ని కలిసి స్టోరీ లైన్ వినిపించాడట. అది నచ్చి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని కాజల్ కోరిందట. ఈ స్క్రిప్ట్ కనుక ఓకే అనిపిస్తే త్వరలో కాజల్ లేడి ఓరియెంటెడ్ చిత్రం చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పడున్న కాజల్ వైఖరి చూస్తుంటే తనలోని కొత్త యాంగిల్ చూపించేందుకు ఈ అమ్మడు చాలా తహతహలాడుతున్నట్టు అర్ధమవుతుంది.