కార్తీ ఖైదీ టీజ‌ర్‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్

Fri,May 31, 2019 07:15 AM

త‌మిళ హీరో కార్తీ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం ఖైదీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌ల పోస్ట‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచిన యూనిట్ తాజాగా టీజ‌ర్ విడుద‌ల చేసింది. ఇందులో కార్తీ లుక్ అభిమానుల‌కి పూన‌కం వ‌చ్చేలా చేస్తుంది. మా న‌గ‌రం ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రాన్ని యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంతో కార్తీ మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రోవైపు రెమో ఫేమ్‌ భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు కార్తీ. రష్మికా మండన్నా కథానాయికగా నటించనుంది. ఇదే కాక పాప‌నాశం తెర‌కెక్కించిన జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ సినిమా చేస్తున్నాడు కార్తీ. జ్యోతిక‌, స‌త్య‌రాజ్ ప్రధాన పాత్ర‌ల‌లో న‌టించ‌నున్న ఈ సినిమాలో ఆన్స‌న్ పాల్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. గోవింద్ వ‌సంత్ చిత్రానికి సంగీతం అందించ‌నుండ‌గా, రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

1767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles