అర్జున్ రెడ్డి రీమేక్‌లో కైరా అద్వానీ

Tue,September 25, 2018 05:39 PM
kaira advani is now hindi ArjunReddy heroine

ముంబై : తెలుగు బ్లాక్ బ్లాస్టర్ సినిమా అర్జున్ రెడ్డి తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళ్‌లో విక్రమ్ తనయుడు హీరోగా నటిస్తోండగా..హిందీ రీమేక్‌లో షాహిద్‌కపూర్ నటిస్తున్నాడు. హిందీ వెర్షన్‌లో షాహిద్ కు జోడీగా బాలీవుడ్ నటి కైరా అద్వానీని ఓకే చేసింది చిత్రయూనిట్.

నాకెంతో ఇష్టమైన సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒకటి. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు సంబంధించి విభిన్న పార్శాలుంటాయి. ఈ పాత్రలో నటించేందుకు ఎంతో ఎక్సయిటింగ్‌గా ఎదురుచూస్తున్నా.. మీ అందరి దీవెనలు కావాలని ట్వీట్ చేసింది కైరా. అర్జున్ రెడ్డి హీరోయిన్ పాత్రకు కైరా అద్వానీ సరిగ్గా సరిపోతుంది. ఈ పాత్రకు పరిణతితో కూడిన నటన చాలా ముఖ్యం. అందుకే కైరాను హీరోయిన్‌గా ఎంపిక చేశామని సందీప్ రెడ్డి వంగా తెలిపాడు.


1943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles