చంద్ర‌బాబు స‌తీమ‌ణి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టి..!

Thu,August 16, 2018 10:12 AM
kaikala satyanarayana plays key role in sr ntr

టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బయోపిక్స్ లో ఎన్టీఆర్ ఒకటి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తుండగా, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో పాత్ర‌ల‌కి సంబంధించి కొంత క్లారిటీ వ‌స్తుంది. ప్ర‌స్తుత ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర‌లో రానా నటిస్తుండ‌గా, ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టి మంజిమో మోహ‌న్ న‌టిస్తుంద‌ట‌. సాహ‌సం శ్వాస‌గా సాగిపో అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి బాగా సుప‌రిచితం అయిన మంజిమా ఈ ఆఫ‌ర్ త‌న‌కి ద‌క్క‌డంతో చాలా సంతోషంగా ఉంద‌ని తెలుస్తుంది. ఇక శ్రీదేవిగా ర‌కుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ ,మరో కీలక పాత్ర హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణని చిత్ర బృందం ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే .1949 జూలై 5న ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మనదేశం షూటింగ్ ప్రారంభమైంది. ఓ గొప్ప చరిత్రకు శ్రీకారం జరిగిన ఆ పవిత్రమైన రోజున ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ కూడా ప్రారంబించారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

2303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS