వ‌ర్మ‌ని అరెస్ట్ చేయ‌డం ఖాయ‌మా ?

Mon,December 18, 2017 10:33 AM
kadapa trailer in controversy

కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. సినిమాల‌తోనే ప‌దునైన కామెంట్స్‌తోను ప‌లు వివాదాల‌లో నిలుస్తుంటాడు వ‌ర్మ‌. త‌ను అనుకున్న‌ది తెర‌పైన చూపించ‌డానికి సెన్సార్ బోర్డు అడ్డు వ‌స్తుంద‌ని భావించిన వ‌ర్మ ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియాని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా ప‌లు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు. తాజాగా క‌డ‌ప రెడ్ల నిజాలు అంటూ వెబ్ సిరీస్ మొద‌లు పెట్ట‌గా దీనికి సంబంధించిన ట్రైల‌ర్‌ని రీసెంట్‌గా విడుద‌ల చేశాడు. ఇందులో బోల్డ్ కంటెంట్‌తో పాటు ఫ్యాక్ష‌నిజం, బూతు ప‌దాలు కూడా ఉన్నాయి. దీంతో వ‌ర్మ వివాదానికి ఆజ్యం పోసాడ‌ని, ప్రశాంతగా ఉన్న రాయలసీమను ఫ్యాక్షన్ అడ్డాగా చూపిస్తూ.. సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని .. ఈ కారణంగా వ‌ర్మ‌ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాయలసీమ విమోచన సమితి నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. క‌డ‌ప‌లోనే హింస పుట్టింద‌ని, ట్రైల‌ర్‌లో హింసాత్మ‌క స‌న్నివేశాలు చూపించార‌ని, ఇందుకోసం వ‌ర్మని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని అనంత‌పురం త్రీటౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వర్మను వెంటనే అరెస్ట్ చేయకపోతే కోర్టులో పిల్ దాఖలు చేయడానికైనా సిద్ధమే అంటున్నారు రాయలసీమ విమోచన సమితి నాయకులు. మ‌రి ఈ నేప‌ధ్యంలో వ‌ర్మ అరెస్ట్ ఖాయంగా క‌నిపిస్తుంద‌ని ప‌లువురు అనుమానాన్ని వ్య‌క్త ప‌రుస్తున్నారు.

3490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS