డియ‌ర్ కామ్రేడ్ నుండి రొమాంటిక్ సాంగ్ విడుద‌ల‌

Wed,May 15, 2019 11:58 AM

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంథాన కాంబినేషన్ లో రూపొందిన చిత్రం `డియ‌ర్ కామ్రేడ్స‌. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 26న విడుద‌ల చేయ‌నున్నారు. ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను ఒకే రోజున విడుద‌ల చేస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రం నుండి సెకండ్ సాంగ్ విడుద‌ల చేశారు. క‌థ‌ల‌ల్లే అంటూ సాగే ఈ పాట‌కి రెహ‌మాన్ లిరిక్స్ అందించ‌గా సిద్ శ్రీరామ్‌, ఐశ్వ‌ర్య ర‌విచంద్ర‌న్ గానం అందించారు. రొమాంటిక్‌గా సాగే ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. మీరు ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి.


1275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles