వంద కోట్ల క్ల‌బ్‌లోకి అడుగు పెట్టిన 'క‌బీర్ సింగ్'

Wed,June 26, 2019 01:40 PM
Kabir Singh crosses Rs 100 crore mark

షాహిద్ క‌పూర్, కైరా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సందీప్ రెడ్డి వంగ తెర‌కెక్కించిన చిత్రం క‌బీర్ సింగ్. తెలుగు అర్జున్ రెడ్డికి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వర్షం సృష్టిస్తుంది. కేవ‌లం ఐదు రోజుల‌లోనే ఈ చిత్రం 104.9 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన‌ట్టు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్వీట్‌లో తెలిపారు. తొలి రోజు ఈ చిత్రం రూ.20.21 కోట్లు (శుక్రవారం), శనివారం రూ.22.71 కోట్లు, ఆదివారం రూ.27.91 కోట్లు, సోమవారం రూ.17.54 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. షాహిద్ క‌పూర్ కెరియర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ళు సాధించిన చిత్రంగా క‌బీర్ సింగ్ నిలిచింది. ఈ ఏడాది విడుద‌లైన చిత్రాల‌లో భార‌త్ చిత్రం 42.30 కోట్ల‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా, క‌ళంక్ 21.60 కోట్ల‌తో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో కేస‌రి ( 21.06 కోట్లు) ఉంది. క‌బీర్ సింగ్ నాలుగో స్థానంలో నిల‌వ‌డం విశేషం. అమెరికాలోను ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న క్ర‌మంలో థియేట‌ర్ల సంఖ్య పెంచారట‌. జూన్ 28 నుండి మ‌రో 45 స్క్రీన్స్‌ని పెంచ‌నున్న‌ట్టు తెలుస్తుంది.



1439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles