బాహుబలి రికార్డులని చెరిపేస్తున్న కబాలి

Sat,July 23, 2016 09:15 AM
kabali breaks the record of bahubali

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం క్రియేట్ చేసిన రికార్డులను కొంత కాలం మరే చిత్రం చెరిపేయలేదని ట్రేడ్ వర్గాలు భావించాయి. కాని కబాలి మానియా ఆ రికార్డులన్నింటిని సింపుల్‌గా బ్రేక్ చేస్తోంది. పలు దేశాలలో విడుదలైన కబాలి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాదాపు 12000 స్క్రీన్‌లలో ఈ సినిమా విడుదల కాగా, కబాలి కలెక్షన్ల మోత మ్రోగిస్తుందని చెబుతున్నారు. యూఎస్‌లో 400 థియేటర్లలో విడుదలైన కబాలి, కేవలం ప్రీమియర్ల రూపంలో $2 మిలియన్ డాలర్లను సంపాదించింది. గతంలో బాహుబలి ప్రీమియర్ల ద్వారా 1.39 మిలియన్ డాలర్లు కొల్లగొట్టగా, ఆ రికార్డ్‌ని కబాలి బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు కలెక్షన్లు కాన్‌స్టెంట్‌గా వస్తున్నాయి. మరి ఈ చిత్రం రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

కబాలి చిత్రానికి ముందు యూఎస్ లో సౌత్ సినిమాలు సాధించిన వసూళ్ళ వివరాలు

5974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles