కాలా తెలుగు టీజ‌ర్ వ‌చ్చేసింది

Fri,March 2, 2018 10:22 AM
Kaala telugu  Official Teaser

అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న కాలా చిత్ర టీజ‌ర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైంది. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్ర త‌మిళ టీజ‌ర్ గ‌త రాత్రి విడుద‌ల చేయ‌గా, తెలుగు, హిందీ భాష‌ల‌కి సంబంధించిన టీజ‌ర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. ‘‘కాలా అంటే ఎవరు.. కాలుడు కరికాలుడు. గొడవపడైనా సరే కాపాడేవాడు..’’ అంటూ రజినీ గురించి ఇంట్రడక్షన్ ఉంది. ‘నలుపు.. శ్రమజీవుల వర్ణం.. మా వాడకొచ్చి చూడు.. మురికంతా ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది’ .‘ కాలా అంటే నలుపు.. చావుకే దేవుడు’, ‘క్యారే.. షట్టింగా’ అనే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. మాఫియా డాన్‌గా క‌రికాల‌న్ పాత్ర‌లో ర‌జనీకాంత్ అద‌రగొట్టారు. వండ‌ర్ బార్ ఫిలింస్ ప‌తాకంపై ధ‌నుష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుద‌ల కానుంది. నానా ప‌టేక‌ర్ డైలాగ్‌తో మొద‌లైన టీజ‌ర్ యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ర‌జ‌నీకాంత్ 164వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు. తమిళ నటుడు సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముంబై నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ మాఫియా డాన్ గా అద‌ర‌గొట్టాడ‌ని టీజ‌ర్‌ని బ‌ట్టి చెబుతున్నారు.

3580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles