కాలా రిలీజ్ పై తప్పిన క్లారిటీ..!

Wed,March 21, 2018 04:57 PM
kaala release postponed

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రాలు 2.0, కాలా విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. శంకర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 2.0 చిత్ర రిలీజ్ పై ఇప్పటికి క్లారిటీ లేకపోగా, కాలా మూవీ ఏప్రిల్ 27న విడుదల కానుందని గతంలో ఎనౌన్స్ చేశారు మేకర్స్. కాని కొన్ని రోజులుగా జరుగుతున్న బంద్ కారణంగా కాలా మూవీ రిలీజ్ పోస్ట్ కానుందని తెలుస్తుంది. తమిళ రాష్ట్రంలో కొన్ని రోజులుగా జరుగుతున్న బంద్ కారణంగా ఎప్పుడో సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు విడుదల కాకుండా ఉన్నాయి. మరి కొద్ది రోజులలో బంద్ విరమింపజేసే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో మొదట సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుందట టీఎఫ్పీసీ. ఈ కారణంగా వండర్ బార్ ఫిలింస్ మరియు లైకా ప్రొడక్షన్ సంస్థలని కాలా రిలీజ్ వేసుకోమని కోరిందట టీఎఫ్పీసీ . దీనికి ఒప్పుకున్న చిత్ర నిర్మాతలు టీఎఫ్పీసీ చెప్పిన టైంకి తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని అన్నారట. దీంతో కాలా రిలీజ్ పై మరింత సందిగ్ధం నెలకొంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కాలా చిత్రంలో రజనీ సరసన హుమా ఖురేషీ కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ నెల 16 నుండి కోలీవుడ్ లో సినిమా షూటింగ్ లు, ప్రొడక్షన్ వర్క్స్ , ఆడియో వేడుకలు, డబ్బింగ్ కార్యక్రమాలు అన్ని శాశ్వతంగా మూత పడిన సంగతి తెలిసిందే.

937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS