కాలా రిలీజ్ జూన్‌కి వెళ్ళిందా..!

Wed,April 18, 2018 01:22 PM
kaala release in june

కొద్ది రోజులుగా త‌మిళ నాడులో బంద్ కార‌ణంగా త‌మిళ సినిమాలేవి విడుద‌ల కావ‌డం లేద‌న్న సంగ‌తి తెలిసిందే. సినిమాల‌కి సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ కూడా జ‌ర‌గ‌డం లేదు. డిజిట‌లైజేష‌న్‌కి వ్య‌తిరేఖంగా టీఎఫ్‌పీసీ స్ట్రైక్ చేసింది. మార్చి 16న మొద‌లైన బంద్ వ‌ల‌న‌ 47 రోజుల పాటు త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ స్తంభించింది. అయితే క్యూబ్‌ డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌తో నిర్మాతల మండలి జరిపిన చర్చలు స‌ఫలం కావడంతో బంద్‌ని విర‌మించే ఆలోచ‌న‌లో త‌మిళ ప‌రిశ్ర‌మ ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే బంద్ విర‌మ‌ణ త‌ర్వా త ముందుగా సెన్సార్ జ‌రుపుకొన్న సినిమాలు మాత్ర‌మే విడుద‌ల చేయాల‌ని త‌మిళ నిర్మాత‌ల మండ‌లి భావిస్తుంది. ఈ క్ర‌మంలో ఏప్రిల్‌27న విడుద‌ల కావ‌ల‌సి ఉన్న కాలా చిత్రం పోస్ట్ పోన్ అయ్యే అవ‌కాశం కనిపిస్తుంది. గ‌తంలో చిత్ర రిలీజ్ పోస్ట్ పోన్ అయింద‌నే వార్త‌లు రాగా, వీటిని లైకా ప్రొడ‌క్ష‌న్ కొట్టి పారేసింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ‘కాలా’ చిత్ర పంపిణీ హక్కులను పొందిన లేఖా సంస్థ జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. రంజాన్‌ పండుగకు ఒక రోజు ముందుగా జూన్‌ 15న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు కోలీవుడ్ టాక్‌. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం లో తెరకెక్కిన కాలా చిత్రం మురికివాడల నేపథ్యంలో రూపొందగా, ఈ చిత్రంలో రజనీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు. తమిళ నటుడు సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అరవింద్ ఆకాశ్ అనే నటుడు కాలా చిత్రంలో శివాజీ రావ్ గైక్వాడ్ అనే పేరుతో ఓ మరాఠి పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడట. సంతోష్ నారాయణన్‌ సినిమాకు బాణీలు అందించారు.

1303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles