కాలా అఫీషియ‌ల్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

Sat,April 21, 2018 08:31 AM
kaala official release date announced

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఒక్క త‌మిళ నాటే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల కోసం అభిమానులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు. అయితే ఇటీవ‌ల ర‌జ‌నీ న‌టించిన 2.0, కాలా చిత్రాలు వాయిదాల మీద వాయిదాలు ప‌డుతున్నాయి. 2.0 చిత్రం గ్రాఫిక్స్ పనుల‌ వ‌ల‌న డిలే అవుతుంటే, కాలా చిత్రం ఇటీవ‌ల జరిగిన బంద్ కార‌ణంగా వాయిదా ప‌డింది.ముందుగా ఏప్రిల్ 27న కాలా విడుద‌ల అవుతుంద‌ని ప్ర‌క‌టించ‌గా, బంద్ విర‌మ‌ణ త‌ర్వా త ముందుగా సెన్సార్ జ‌రుపుకొన్న సినిమాలు మాత్ర‌మే విడుద‌ల చేయాల‌ని త‌మిళ నిర్మాత‌ల మండ‌లి భావించింద‌ట‌. ఈ క్ర‌మంలో ఏప్రిల్ 27న విడుద‌ల కావ‌ల‌సిన కాలా చిత్రం జూన్ 7కి పోస్ట్ పోన్ అయింది. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం లో తెరకెక్కిన కాలా చిత్రం మురికివాడల నేపథ్యంలో రూపొందగా, ఈ చిత్రంలో రజనీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు. తమిళ నటుడు సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అరవింద్ ఆకాశ్ అనే నటుడు కాలా చిత్రంలో శివాజీ రావ్ గైక్వాడ్ అనే పేరుతో ఓ మరాఠి పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడట. సంతోష్ నారాయణన్‌ సినిమాకు బాణీలు అందించారు

2735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles