కాలాకి 14 క‌ట్స్‌.. ఈ నెల‌లోనే విడుద‌ల‌

Wed,April 4, 2018 11:23 AM

సూపర్ స్టార్ రజనీకాంత్‌, క్రేజీ డైరెక్టర్ పా రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన‌ క్రేజీ ప్రాజెక్ట్ కాలా. మురికివాడల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రజనీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీ అయింది. ఏప్రిల్ 27న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. 14 క‌ట్స్ ఇచ్చిన బోర్డు స‌భ్యులు మూవీకి యూ/ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో జ‌రుగుతున్న బంద్ కార‌ణంగా కాలా సినిమా రిలీజ్ డేట్ మారిందని ఇటీవ‌ల పుకార్లు షికారు చేశాయి. ఈ పుకార్ల‌ని ఖండించిన లైకా అనుకున్న టైంకే మూవీని విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. వండ‌ర్ బార్ ఫిలింస్ మ‌రియు లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు. తమిళ నటుడు సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అరవింద్ ఆకాశ్ అనే నటుడు కాలా చిత్రంలో శివాజీ రావ్ గైక్వాడ్ అనే పేరుతో ఓ మరాఠి పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడట. ముంబై నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ మాఫియా డాన్ గా క‌నిపించ‌నున్నాడు. సంతోష్ నారాయణన్‌ సినిమాకు బాణీలు అందించారు.

1712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles