ఆ ఘ‌న‌త సాధించిన తొలి ఇండియ‌న్ సినిమా కాలా

Thu,June 7, 2018 03:41 PM
kaala creates new record

ర‌జ‌నీకాంత్ తాజా చిత్రం కాలా కోసం అభిమానులు ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఈ సినిమా నేడు గ్రాండ్‌గా విడుద‌లైంది. చిత్ర స‌క్సెస్ ని త‌లైవా అభిమానుల‌తో పాటు చిత్ర యూనిట్ కూడా సెల‌బ్రేట్ చేసుకుంటుంది. అయితే రికార్డుల వేట మొద‌లు పెట్టిన ఈ చిత్రం అరుదైన ఘ‌న‌త సాధించింది. సౌదీ అరేబియాలో విడుద‌లైన తొలి ఇండియ‌న్ సినిమాగా కాలా చిత్రం నిలిచింద‌ని చిత్ర నిర్మాణ సంస్థ వండ‌ర్ బార్ ఫిలింస్ త‌మ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. భాష‌, యాసతో సంబంధం లేకుండా దేశ విదేశాల‌లో ర‌జ‌నీకాంత్‌కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా నానా ప‌టేక‌ర్, హుమా ఖురేషీ, ఈశ్వ‌రీ రావు త‌దిత‌రులు చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.


4164
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles