చెన్నైలో 'కాలా' ప్ర‌కంప‌న‌లు

Fri,June 8, 2018 12:38 PM

లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, వండ‌ర్‌బార్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం కాలా. ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో అత్యంత ఆస‌క్తిగ‌ల చిత్రంగా రూపొందిన ఈ మూవీ చెన్నైలో వ‌సూళ్ళ వ‌ర్షం సృష్టిస్తుంది. ఇంత‌క‌ముందు విడుద‌లైన త‌మిళ సినిమా రికార్డుల‌న్నీ కొల్ల‌గొట్టి ఈ సినిమా టాప్ పొజీష‌న్‌కి చేరింద‌ని అంటున్నారు. త‌మిళ నాట ర‌జనీకాంత్‌కి భారీ క్రేజ్ ఉన్న నేప‌థ్యంలో కాలా చిత్రం చెన్నై సిటిలో తొలి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మొద‌టి రోజు ఈ చిత్రం చెన్నైలో రూ.1.76 కోట్ల గ్రాస్ రాబట్టి గతంలో విజయ్ సినిమా ‘మెర్సల్’ పేరు మీదున్న రూ.1.52 కోట్ల రికార్డుని అధిగమించింది. రూ 1.21 కోట్ల‌తో మెర్స‌ల్ మూడో స్థానంలో ఉండ‌గా, రూ 1.12 కోట్ల‌తో క‌బాలి నాలుగో స్థానంలో, రూ 1.05 కోట్ల‌తో థేరీ ఐదో స్థానంలో నిలిచింది. అయితే యూఎస్ లో మాత్రం కాలా చిత్రం క‌బాలి అంత వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేద‌ని అంటున్నారు. మురికి వాడ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన కాలా చిత్రం పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కగా, ఇందులో నానా ప‌టేక‌ర్, హుమా ఖురేషీ, ఈశ్వ‌రీ రావు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించారు.6481
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles