కాలా ఆడియో వేడుకకి వెన్యూ ఫిక్స్ చేసిన ధ‌నుష్‌

Sat,May 5, 2018 10:37 AM
Kaala Audio Launch Venue Finalized

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం కాలా. పా రంజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. జూన్ 7న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌, రీసెంట్‌గా ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల చేశారు. య‌మ గ్రేట్ అంటూ సాగే ఈ పాట‌కి సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందించ‌గా, హ‌రిహ‌ర‌సుధ‌న్,సంతోష్ నారాయణ్ క‌లిసి పాడారు.ఈ సాంగ్ ర‌జ‌నీ అభిమానుల‌ని అల‌రించింది. ఇక చిత్ర ఆడియో వేడుక‌ని మే 9న చెన్నైలోని వైఎమ్‌సీఏ నంద‌నంలో జ‌ర‌ప‌నున్నారు. మెడిక‌ల్ చెక‌ప్ కోసం యూఎస్ వెళ్ళిన ర‌జనీ ఈ లోపు చెన్నైకి తిరిగి రానున్నారు. చిత్ర యూనిట్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఆడియో వేడుక కార్య‌క్ర‌మంలో పాలు పంచుకోనున్నారు. కాలా చిత్రం మురికివాడల నేపథ్యంలో రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రజనీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు. తమిళ నటుడు సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అరవింద్ ఆకాశ్ అనే నటుడు కాలా చిత్రంలో శివాజీ రావ్ గైక్వాడ్ అనే పేరుతో ఓ మరాఠి పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడని స‌మాచారం.వండ‌ర్ బార్ ఫిలింస్ బేన‌ర్‌పై ధ‌నుష్ కాలా చిత్రాన్ని నిర్మించారు.1231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles