చైర్మన్ పదవికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు రాజీనామా..

Mon,May 27, 2019 01:38 PM
 K Raghavendra Rao Who resigned as chairman of SVBC

హైద‌రాబాద్: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్‌వీబీసీ) చైర్మన్ పదవికి సినీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు రాజీనామా చేశారు. వయోభారం వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యాజమాన్యానికి, సిబ్బందికి ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 21వ తేదీన రాఘ‌వేంద్ర‌రావు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యులుగా కొన‌సాగుతూ ఛానెల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన‌ ఆయనను అప్పటి ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేర‌కు టీటీడీ.. రాఘవేంద్రరావును ఛానెల్ చైర్మన్‌గా నియమించింది. రాఘవేంద్రరావు తన రాజీనామా లేఖను ఈవోతో పాటూ ప్రభుత్వానికి పంపారు. 2015 నుంచి ద‌ర్శ‌కేంద్రుడు టీటీడీలో బోర్డు సభ్యుడిగా ఉంటున్నారు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న నేప‌థ్యంలో రాఘ‌వేంద్ర‌రావు రాజీనామా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

5097
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles