విద్యాబాల‌న్ మూవీ రీమేక్ చేస్తున్న జ్యోతిక‌

Wed,February 28, 2018 11:06 AM
Jyothika to star in Tamil remake

36 వయదినిలే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక ప్ర‌స్తుతం ప‌లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తుంది. ఇటీవల ‘మగళీర్ మట్టుం’, నాచియార్ అనే చిత్రాల‌తో అల‌రించింది. నాచియార్ చిత్రం శివ పుత్రుడు , నేనే దేవుడ్ని , వాడు వీడు లాంటి చిత్రాలు తెర‌కెక్కించిన‌ బాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ఈ సినిమాలోని డైలాగ్స్ జ్యోతిక‌ని ప‌లు ఇబ్బందుల్లోకి నెట్టిన సంగ‌తి తెలిసిందే. క‌ట్ చేస్తే జ్యోతిక బాలీవుడ్ బ్యూటీ విద్యాబాల‌న్ న‌టించిన తుమ్హారీ సులు అనే చిత్రం త‌మిళంలో రీమేక్ చేస్తుంది. రాధామోహ‌న్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కనున్న ఈ సినిమాకి ధ‌నుంజ‌యంగ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. మేలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్ళ‌నుండ‌గా, ఈ సినిమా కోసం జ్యోతిక మేకోవ‌ర్ మార్చుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.ఉంగ‌ల్ జో అనే టైటిల్‌ని త‌మిళ వర్షెన్‌కి ప‌రిశీలిస్తున్నారు.

965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles