త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్న జ్యోతిక‌

Sat,July 14, 2018 01:27 PM
Jyothika movie released in telugu with jhansi title

ఒకప్పుడు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఉన్న జ్యోతిక, త‌మిళ హీరో సూర్య‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కి దూరంగా ఉంది. తెలుగులో ప‌లు హిట్ చిత్రాల‌లో న‌టించిన జ్యోతిక 36 వయోదినిలే చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు సాధించింది. మంచి స్క్రిప్ట్ లని ఎంచుకుంటూ వెళుతున్న జ్యోతిక ఐకానిక్ ఫిలిం మేకర్ బాలా డైరెక్షన్ లో నాచియార్ అనే సినిమా చేసింది. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో క్రూర‌మైన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించింది. రిలీజ్ కి ముందు ఆమె పాత్ర‌కి విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌, త‌ర్వాత మంచి ప్రశంస‌లు ల‌భించాయి. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఇత‌ని పాత్ర ఫ‌న్నీగా ఉండ‌డంతో పాటు ఆస‌క్తిని క‌లిగించింది. క్రైమ్ డ్రామా మూవీగా రూపొందిన ఈ చిత్రం కి మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందించటం విశేషం. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఝాన్సీ పేరుతో ఈ చిత్రం విడుద‌ల కానుంద‌ని, త్వ‌ర‌లోనే టీజ‌ర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత జ్యోతిక సినిమా తెలుగులో వ‌స్తుండ‌డంతో అభిమానుల‌లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

2906
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles